
పవిత్ర… ఎంతో పవిత్రమైన పేరు. కన్నడ చిత్రసీమ మొత్తం ఇప్పుడీ పేరు చుట్టూనే తిరుగుతోంది. రీసెంట్ గా వార్తల్లో ప్రముఖంగా నిలిచిన వ్యవహారాల్లో పవిత్ర పేరు కామన్ గా కనిపిస్తోంది.
ఉదాహరణకు దర్శన్ కేసునే తీసుకుంటే, ఈ కేసు మొత్తానికి మూలం పవిత్ర గౌడ.
పవిత్ర గౌడ
దర్శన్, పవిత్ర గౌడ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆమెను తన వీరాభిమాని రేణుకాస్వామి ఏదో అన్నాడని, పోర్న్ వీడియోలు పంపించాడని దర్శన్ కు కోపమొచ్చింది. మరికొంతమందితో కలిసి అతడ్ని కిడ్నాప్ చేయించాడు, తర్వాత రేణుకాస్వామి చనిపోయాడు. ప్రస్తుతం ఈ కేసు నడుస్తోంది. కన్నడ చిత్రసీమ మొత్తం పవిత్ర గౌడ కేసు గురించే మాట్లాడుకుంటోంది. ఈ కేసులో ఆమె ఏ-1. దర్శన్ కు ఇదివరకే పెళ్లయింది. అటు పవిత్ర గౌడకు కూడా పెళ్లయింది. కానీ ఆమె డివోర్సీ.

పవిత్ర జయరాం
పవిత్ర గౌడ కంటే ముందు టీవీ యాంకర్ పవిత్ర జయరాం వార్తల్లో నలిగిన సంగతి తెలిసిందే. ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించింది. ఆమె మరణించిన కొన్ని రోజులకే ఆమె సహనటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అంతా అవాక్కయ్యారు. అప్పుడు బయటకొచ్చింది వీళ్ల సహజీవనం వ్యవహారం.
దాదాపు ఆరేళ్లుగా పవిత్ర-చందు కలిసి ఉన్నారు. పవిత్రకు ఆల్రెడీ పెళ్లయింది, కూతురు ఉంది. చందుకు కూడా పెళ్లయింది, ఇద్దరు పిల్లలున్నారు.

పవిత్ర లోకేష్
ఇక పవిత్ర లోకేష్ సంగతి లోకమంతా తెలుసు. సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ చాన్నాళ్ల పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత తమ మేటర్ ను బాహ్య ప్రపంచానికి తెలియజేశారు.
అయితే ఇటు నరేష్ తన భార్యకు విడాకులివ్వలేదు, అటు పవిత్ర కూడా తన భర్తకు విడాకులివ్వలేదు. వీళ్లిద్దరి వ్యవహారం చాన్నాళ్ల పాటు మీడియాలో నలిగింది. ఆ తర్వాత ఇద్దరూ కోర్టుకెక్కారు. కలిసి ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా కూడా చేశారు.

ఇలా ఈమధ్య కాలంలో పవిత్ర పేరుతో మీడియాలో చాలా డిస్కషన్లు నడుస్తున్నాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే.. .ఈ ‘పవిత్ర’లందరూ కన్నడిగులే.