
‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలకు సరిగా నెల రోజులే ఉంది. కానీ, ఆ సినిమా విడుదలపై మళ్ళీ డౌట్స్ మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల అగ్ని ప్రమాదంలో చిక్కుకొని బయటపడ్డారు. ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్ లోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నాడు.
తండ్రిగా పవన్ కళ్యాణ్ మరికొన్నాళ్లూ అక్కడే ఉండాలి. పవన్ కళ్యాణ్ ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాతే సినిమా విడుదలపై ఒక క్లారిటీ రావొచ్చు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని సీన్ల చిత్రీకరణ ఇంకా మిగిలి ఉంది. ఆ సీన్లు లేకుండా కూడా మూవీని విడుదల చేయొచ్చు అని అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అనుమతి కావాలి.
మరి నిర్మాత ఏ నిర్ణయం తీసుకుంటారో.
పవన్ కళ్యాణ్ సినిమా కనుక మే9న విడుదల కాకపోతే, ఆ రోజుకు తమ సినిమాలని విడుదల చేసేందుకు ఇద్దరు ముగ్గురు నిర్మాతలు రెడీగా ఉన్నారు.