
అకిరా డెబ్యూపై మరోసారి స్పందించారు ఆమె తల్లి రేణు దేశాయ్. అకియా హీరో అయితే చూడాలని అందరికంటే తనకే ఎక్కువగా ఉందని, కానీ ఇప్పట్లో అకిరా తెరపైకి రాడని ఆమె అంటున్నారు. ఇదే విషయాన్ని తను గతంలో కూడా చెప్పానని, దయచేసి అకిరా డెబ్యూపై థంబ్ నెయిల్స్ పెట్టడం మానేయాలని ఆమె కోరారు.
“అకిరా ఓజీలో ఉన్నాడనేది వాస్తవం కాదు. రామ్ చరణ్ నిర్మాణంలో కూడా సినిమా చేయడం లేదు. తను సినిమాల్లోకి రావాలనుకుంటున్నట్టు అకిరా చెబితే, ఆ విషయాన్ని నేనే స్వయంగా ఇనస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. ఈ విషయంలో నాకంటే ఆనందించే వాళ్లు ఎవరుంటారు”
అకిరా తండ్రి పెద్ద హీరో అని, వాళ్ల కుటుంబం మొత్తం హీరోల కుటుంబమని అంటోంది రేణు దేశాయ్. తను కూడా నటిగా కొన్నాళ్లు పనిచేశాను కాబట్టి, అకిరా హీరోగా ఎదిగితే అందరికీ ఆనందమే అంటోంది.
అయితే తాము మాత్రం అకిరాను బలవంతం చేయడం లేదని, నటన కాకుండా, తనకు ఇష్టమైన ఏ పని చేసినా దానికి తామంతా అంగీకరిస్తామని అన్నారు.