టైగర్ నాగేశ్వరరావు.. ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీని సైన్ లాంగ్వేజ్ లో కూడా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు మేకర్స్. గత ఏడాది సినిమా విడుదలైంది. సినిమా డిజాస్టర్ అయిన తర్వాత ఈ విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు.
అయితే ఇప్పుడీ సినిమా మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి కూడా కారణం సైన్ లాంగ్వేజ్. ఈ సినిమా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ వెర్షన్ ను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు పెట్టారు. చెవులు వినిపించని, చదవలేని వ్యక్తులకు ఈ సైన్ లాంగ్వేజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
సైన్ లాంగ్వేజ్ వెర్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ను ఓసారి చెక్ చేయొచ్చు.
వంశీ డైరక్ట్ చేసిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. నుపుర్ సనన్, గాయత్రి భరధ్వాజ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతోనే రేణుదేశాయ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. భారీ ఖర్చుతో తీస్తే నిర్మాతకు బాగా నష్టాలు మిగిల్చింది.