బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పట్టుబడినప్పుడు ఎన్నో అనుమానాలు, మరెన్నో ఊహాగానాలు. ఆ న్యూస్ ను నిర్ధారించుకోవడానికి మీడియాకు చాలా సమయం పట్టింది. దీనికి ఓ కారణం ఉంది. అది తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ మేటర్ ఏంటంటే..
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లలో హేమ కూడా ఒకరు. ఆమె టాలీవుడ్ లో పాపులర్ కానీ కన్నడలో కాదు కదా. అందుకే పోలీసులు వెంటనే గుర్తుపట్టలేకపోయారు. పోలీసులు ఆమెని పేరు చెప్పమని అడిగినప్పుడు హేమ అని చెప్పకుండా కృష్ణవేణి అని చెప్పారంట.
లోతుగా విచారణ జరిపి ఆమె హేమ అని నిర్థారించారట పోలీసులు. ఇంతకీ ఆమె అలా ఎందుకు చెప్పారంటే… ఆమె అసలు పేరు నిజంగానే కృష్ణవేణి. సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత హేమగా పేరు మార్చుకున్నారు. ఒకప్పుడు కృష్ణవేణి పేరుతో ఫేమస్ నటి ఉండేవారు. అందుకే హేమగా తన స్క్రీన్ నేమ్ ని చేసుకున్నారు. అదే పేరుని ఆమె మొదట పోలీసులకు చెప్పారట.
ప్రస్తుతం మీడియా అంతా ఆమె వార్తలే. టీవీ ఛానెల్స్ కి హేమ మంచి వార్త సరుకుగా మారారు. ఇక మరికొన్ని రోజుల్లో మీడియా ముందుకొస్తానంటున్నారు హేమ.