టాలీవుడ్ లో సినిమాలు వాయిదాలు పడడం ఆనవాయితీగా మారింది. ఇప్పటికే పలు సినిమాలు వాయిదా పడ్డాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో సినిమా చేరింది. దాని పేరు “మ్యూజిక్ షాపు మూర్తి.” అజయ్ ఘోష్, చాందినీ చౌదరి లీడ్ రోల్స్ పోషించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. మంచి కాన్సెప్ట్, కంటెంట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని శివ పాలడుగు తెరకెక్కించాడు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్, పాటలు రిలీజయ్యాయి. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాను జూన్ 14న విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. లెక్కప్రకారం ఈ సినిమా 31వ తేదీన విడుదల కావాలి. కానీ జూన్ 14కు వాయిదా వేశారు.
31న గ్యాంగ్స్ ఆప్ గోదావరి, భజే వాయువేగం, గమ్ గమ్ గణేశ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ మూడు సినిమాలకు మంచి బ్యాకప్ ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వెనక సితార, భజే వాయువేగం వెనక యూవీ క్రియేషన్స్ ఉన్నాయి. “గమ్ గమ్ గణేశ”కి మైత్రి మూవీస్ సపోర్ట్ చేస్తోంది. దీంతో మిగతా సినిమాలు వాయిదా పడక తప్పని పరిస్థితి. ఇందులో భాగంగానే చిన్న సినిమా అయిన “మ్యూజిక్ షాప్” మూర్తి పోస్ట్ పోన్ అయింది.
జూన్ 14న కూడా “హరోం హర” వంటి సినిమాలు ఉన్నాయి. కానీ మూడు సినిమాలతో పోటీ పడడం కన్నా ఒక్క సినిమాతో పోటీ బెటర్ అనుకున్నారేమో.