
‘శాకుంతలం’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న గుణశేఖర్, ఈసారి యూత్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. దాని పేరు ‘యుఫోరియా’. గుణ హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా అప్ డేట్ ఇచ్చారు.
శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. సినిమా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తున్న విషయాన్ని ఆ వీడియోలో ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ రిలీజైన సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో విఘ్నేష్ గవిరెడ్డి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. చాలామంది యంగ్ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాలో భూమిక కీలక పాత్రలో కనిపించనుంది. గుణశేఖర్ డైరక్ట్ చేసిన “ఒక్కడు”లో హీరోయిన్ గా నటించిన భూమిక, 20 ఏళ్ల తర్వాత తిరిగి అతడి దర్శకత్వంలో ‘యుఫోరియా’ చేస్తోంది.
ఈ చిత్రం ఆధునిక యువత దుష్ప్రవర్తనను, రెచ్చగొట్టే వైఖరిని, మాదకద్రవ్యాల వాడకాన్ని చూపించబోతోంది. ఇందులో హీరోహీరోయిన్ అంటూ ఎవ్వరూ ఉండరని, అందరూ హీరోలే, అమ్మాయిలంతా హీరోయిన్లే అని గుణశేఖర్ ఇదివరకే ప్రకటించారు.