
పూజ హెగ్డే అంటే సొగసుల షో. ఆమె అందాన్ని చూసి.. “సామజవరగమనా నిన్ను చూసి ఆగగలనా” ని కవులు పాటలు రాశారు. ఐతే తనకి గ్లామరే కాదు యాక్టింగ్ గ్రామర్ కూడా తెలుసు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది ఇప్పుడు.
ఇప్పటికే సూర్య సరసన “రెట్రో” చిత్రంలో డిగ్లామ్ రోల్ చేసింది. సగటు యువతి పాత్రలో మెప్పిస్తోంది. ఇక ఒక కొత్త సినిమాలో ఆమె మూగమ్మాయిగా కనిపించనుందట.
రాఘవ లారెన్స్ ఇప్పటికే ఎన్నో కాంచన సినిమాలు తీశాడు రకరకాల పేర్లతో. మళ్ళీ అదే సిరీస్ లో నాలుగో సినిమా తీస్తున్నాడు. ఈ “కాంచన 4′ పూజా హెగ్డేకి ప్రధాన పాత్ర దక్కింది. ఇందులోనే ఆమె మూగ, చెవిటి యువతిగా కనిపిస్తుందట. ఈ పాత్ర ఆమెకి ఛాలెంజ్. ఈ సవాల్ ని పూజ స్వీకరించింది.
ప్రస్తుతం పూజ హెగ్డే తమిళంలో “రెట్రో” (మే 1న విడుదల), విజయ్ సరసన “జన నాయగన్”, “కాంచన 4” చిత్రాలు చేస్తోంది.