
“హను మాన్” సినిమా హిట్ కాగానే దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ సినిమా, ఈ సినిమా అంటూ అనేక ప్రకటనలు చేశాడు. “జై హను మాన్”, “మోక్షజ్ఞ నందమూరి మొదటి సినిమా”, రణ్వీర్ సింగ్ తో “బ్రహ్మ రాక్షస్”, ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ… ఇలా హంగామా చేశాడు. కానీ అందులో ఏవీ మొదలు కాలేదు.
మోక్షజ్ఞ సినిమా ఉందో లేదో తెలియని సందిగ్ధంలో పడింది. “జై హను మాన్” షూటింగ్ కి టైం ఇచ్చేందుకు రిషబ్ శెట్టి వద్ద ఇప్పుడు డేట్స్ లేవు. రణ్వీర్ సింగ్ “బ్రహ్మ రాక్షస్” చిత్రాన్ని ఆపేశాడు.
దాంతో కొన్నాళ్ళూ ప్రశాంత్ వర్మ దాదాపుగా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఐతే, ఇప్పుడు అతనికి ప్రభాస్ పిలిచి తన సినిమా ఆఫర్ ఇచ్చాడు. రణ్వీర్ సింగ్ ఆపేసియాన్ “బ్రహ్మరాక్షస్”ని ప్రభాస్ తో చేస్తున్నాడు అని టాక్.
ఈ రోజు ప్రభాస్ పై లుక్ టెస్ట్ కూడా జరిగింది అని అంటున్నారు. ఈ సినిమాని “కేజీఎఫ్”, “సలార్” నిర్మించిన హోంబలే సంస్థ నిర్మిస్తోంది. మొత్తానికి ప్రభాస్ ఎస్ చెప్పడంతో ప్రశాంత్ వర్మకి డిప్రెషన్ పోయింది. మళ్ళీ ఉత్సాహం వచ్చింది.