అందాన్ని కాపాడుకోవడం, ఉన్న ఫిజిక్ ను మెయింటైన్ చేయడం హీరోయిన్లకు కత్తి మీద సాము లాంటి వ్యవహారం. సంపాదించిన డబ్బులో చాలా భాగాన్ని అందాన్ని కాపాడుకోవడానికే ఖర్చు చేస్తారు.
ఇక ఫిగర్ మెయింటైన్ చేయడం కోసం వీళ్లు పడే కష్టం ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. కడుపు మాడ్చుకొని కష్టపడతారు వీళ్లంతా. ఇలాంటి కష్టమే నటి దివికి కూడా ఉంది.
ఈ పొడుగుకాళ్ల సుందరి తన ఫిజిక్ ను కాపాడుకునేందుకు మిగతా హీరోియన్లలానే రోజూ పొద్దున్నే లేచి వ్యాయామం చేస్తుంది. ఆ తర్వాత యోగా ప్రాక్టీస్ చేస్తుంది. ఇలా ప్రతి రోజూ వ్యాయమం కోసం లేవడం చాలా కష్టం అంటోంది దివి.
“పొద్దున్నే నిద్రలేవగానే ఎవరైనా కాఫీ ఇస్తే బాగుండనిపిస్తుంది. ఈరోజు వర్కవుట్ స్కిప్ చేయాలనిపిస్తోంది. అందరికీ ఇలానే అనిపిస్తుందా? అదేంటో నాకు రోజూ ఇలానే అనిపిస్తుంది. ఎందుకో ఈరోజు ఇంకా ఎక్కువ అనిపిస్తోంది.”
ఇలా తన బాధను వెల్లగక్కింది దివి. అలా అని ఆమె వర్కవుట్ ను స్కిప్ చేయలేదు. ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతున్న ఈమె తన ఫిజిక్ ను కాపాడుకోవడం అత్యవసరం. అందుకే ఈ కష్టం.