ఇండస్ట్రీలో చిరు లీక్స్ చాలా ఫేమస్. తన సినిమాలే కాదు, అప్పుడప్పుడు పక్కోళ్ల సినిమాల వివరాల్ని కూడా లీక్స్ ఇచ్చేస్తుంటారు మెగాస్టార్. ఇప్పుడీ లక్షణం ప్రభాస్ లో కూడా కనిపించింది.
“కల్కి 2898 AD” సినిమాలో చాలా సర్ ప్రైజులున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, మృణాల్, దుల్కర్ సల్మాన్.. ఇలా చాలామంది ఇందులో నటించారు. ఈ విషయం కొంతమందికి తెలుసు, మరికొంతమందికి తెలియదు. అయితే మేకర్స్ మాత్రం అధికారికంగా ఎక్కడా చెప్పలేదు.
అలా సీక్రెట్ గా ఉంచాల్సిన విషయాన్ని ప్రభాస్ బయటపెట్టేశాడు. తన సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్, కో-ఆర్టిస్టులకు థ్యాంక్స్ చెప్పిన ప్రభాస్, పనిలో పనిగా దుల్కర్, విజయ్ దేవరకొండకు కూడా థ్యాంక్స్ చెప్పేశాడు.
ఆ వెంటనే నాలుక్కరుచున్నాడు. అయ్యో నేనే లీక్ చేశానా అంటూ లైవ్ లోనే అనేశాడు. నాకు ముందే చెప్పాలి కదా అంటూ నాగ్ అశ్విన్ పై కోప్పడ్డాడు. అదే లైవ్ లో ఉన్న నాగ్ అశ్విన్ నవ్వుతూ తలపట్టుకున్నాడు. ఏం పర్లేదు అంటూ కవర్ చేశాడు. అదీ సంగతి.