
రామ్ చరణ్, ధోని మంచి స్నేహితులు. క్రికెటర్లకు, సినిమా తరాలకు దోస్తీ కొత్తేమి కాదు. ఐతే, తాజాగా వీరి గురించి ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. రామ్ చరణ్ తో ఉన్న స్నేహం కారణంగా ధోని ఆయన సినిమాలో నటిస్తున్నాడు అనేది ఆ వార్త.
ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు అని తేల్చి చెప్పింది రామ్ చరణ్ టీం. ధోని తమ సినిమలో నటించడం లేదు అని, అలాంటి పాత్ర కూడా సినిమాలో లేదు అని క్లారిటీ ఇచ్చింది.
రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు తీస్తున్న స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇందులో హీరో క్రికెట్ సహా ఇతర గేమ్స్ ఆడుతాడు. ఈ కథకున్న నేపథ్యం కారణంగా ఒక పెద్ద క్రికెటర్ ని సినిమాలో నటింప చెయ్యాలని బుచ్చిబాబు భావించాడని, చరణ్ తనకున్న కాంటాక్ట్స్ తో ధోనిని ఒప్పించాడని ప్రచారం మొదలైంది. అంతేకాకుండా, ఇటీవల ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నితిన్ హీరోగా తీసిన “రాబిన్ హుడ్”లో నటించాడు. దాంతో, ధోని – చరణ్ ప్రచారం నిజమే అనిపించింది.
కానీ, తమ సినిమాలో ధోని నటించడం లేదని పక్కాగా చెప్పింది చరణ్ టీం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో సాగుతోంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
కన్నడ సీనియర్ హీరో శివ రాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.