
నటి సురేఖ వాణి కూతురు సుప్రీత చిక్కుల్లో పడింది. ఓ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసి ఆమె కష్టాలు కొని తెచ్చుకుంది. దీనికి సంబంధించి ఆమె ఓ వీడియో రిలీజ్ చేస్తూ, క్షమాపణలు కూడా చెప్పింది.
చాలామంది ఇన్ ఫ్లూయర్స్ లానే తను కూడా తెలిసీతెలియక ఓ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశానని, తనను అంతా క్షమించాలని కోరింది. బెట్టింగ్ యాప్స్ కు అంతా దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేసింది.
ఇప్పటికే లోకల్ బాయ్ నాని, బన్నీ సన్నీ యాదవ్ లాంటి ఇన్ ఫ్లూయర్స్ పై కేసులు పడ్డాయి. సుప్రీత లానే లోకల్ బాయ్ నాని కూడా సారీ చెప్పాడు. కానీ కేసు తప్పలేదు. సుప్రీత విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
ALSO CHECK: Supritha wears green lehenga

పోలీస్ బాస్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ ఫ్లూయన్సర్స్ కు రంగు పడుద్ది అంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు సజ్జనార్.