
దిశా పటాని గతేడాది (2024) మూడు సినిమాల్లో కనిపించింది. హిందీలో ఒకటి, తమిళంలో ఒకటి, తెలుగులో ఒకటి. హిందీలో నటించిన “యోధ” ఫ్లాప్ అయింది. తమిళంలో చేసిన “కంగువ” ఘోరాతిఘోరమైన పరాజయం పాలైంది. ఆమె పాత్ర విషయంలో మరింత ట్రోలింగ్ జరిగింది.
ఆడిన ఏకైక చిత్రం… కల్కి 2898 AD. ఇక ఈ ఏడాది నటిస్తున్న ఒకే ఒక్క చిత్రం… ‘వెల్కమ్’ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతోన్న “వెల్కమ్ టు ది జంగిల్” (Welcome To The Jungle).
2024లో మూడు సినిమాల్లో కనిపించిన ఈ భామ ఇప్పటివరకు ఈ ఏడాది కొత్తగా ఒక్క సినిమా సైన్ చెయ్యలేదు. గతేడాది ఒప్పుకున్న “వెల్కమ్ టు ది జంగిల్” సినిమా షూటింగ్ తోనే బిజీగా ఉంది.
దిశాకి ఆఫర్లు రాకపోవడానికి కారణం… ఆమె ఇప్పటివరకు తన క్రేజ్ వల్ల సినిమాకి లాభం జరిగినట్లు చూపకపోవడమే. ఆమెకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 61 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో అంత క్రేజ్ ఉన్నా… సినిమాల విషయానికి వస్తే పెద్దగా ఉపయోగం ఉండట్లేదు.
ఫోటోషూట్లు

అందుకే, ఆమె సినిమా షూటింగ్ ల కన్నా ఇన్ స్టాగ్రామ్ కోసం ఫోటోషూట్లు చేసుకుంటూ ఎక్కువ బిజీగా ఉంది. ఈ ఇన్ స్టాగ్రామ్ వల్లే ఆమెకి బ్రాండ్స్ వస్తున్నాయి. ఆదాయం వస్తోంది.
ఇక “కల్కి” రెండో భాగంలో కూడా ఈమె నటించనుంది. ఐతే, అది ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదు. సో, ఈ గ్యాప్ లో ఇలాగే ఫోటోషూట్లు చేస్తూ గడిపేస్తుంది కాబోలు.