![Devara](https://telugu.telugucinema.com/wp-content/uploads/2024/09/devararomancef.jpg)
“దేవర-1” హిట్టయింది. దీంతో “దేవర-2″పై అంచనాలు పెరిగాయి. పైగా సినిమాలో సస్పెన్సులు చాలా ఉన్నాయి. సముద్రంలో ఉన్న అస్తిపంజరాలు ఎవరివి? కొడుకు ఎందుకు తండ్రిని చంపాడు? హీరోయిన్, హీరోను పెళ్లి చేసుకుంటుందా లేదా… ఇలా చాలా సందేహాలున్నాయి.
వీటిపై ఎన్టీఆర్ స్పందించలేదు. అవన్నీ సస్పెన్స్ అని చెప్పాడు. “దేవర-2″పై ఆసక్తి కలగాలంటే వాటిని అలానే వదిలేయాలన్నాడు. ఇక పార్ట్-2పై స్పందిస్తూ, దేవర-2కు సంబంధించి 2 భారీ సీక్వెన్సుల షూటింగ్ ఇప్పటికే పూర్తిచేశారట.
సినిమాకు అత్యంత కీలకమైన 2 భారీ ఎపిసోడ్స్ తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని, అది తమకు పెద్ద రిలీఫ్ అని వెల్లడించాడు. అందుకే కొరటాల శివకు నెలన్నర గ్యాప్ ఇచ్చినట్టు తెలిపాడు.
“దేవర-1” హంగామా ముగిసిన వెంటనే కొరటాల, విదేశాలకు వెళ్లి 45 రోజుల పాటు రెస్ట్ తీసుకుంటాడట. తిరిగొచ్చిన తర్వాత దేవర-2 రైటింగ్ పై మరోసారి కూర్చుంటారట. పార్ట్-2 కథ సిద్ధంగా ఉన్నప్పటికీ.. పార్ట్-1 నుంచి ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో పెట్టుకొని దేవర-2ను మరింత భారీగా తెరకెక్కిస్తామని ఎన్టీఆర్ ప్రకటించాడు.