పెద్ద సినిమాల్లో కనిపించకపోవచ్చు. కానీ ఆమెకంటూ సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. మరీ ముఖ్యంగా ఆమె అందాల ఆరబోతకు, ఫొటోషూట్స్ కు కుర్ర ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు. ఆమె మరెవరో కాదు, శ్రద్ధాదాస్.
తెలుగులో అడపాదడపా కనిపించే ఈ బెంగాలీ బ్యూటీ, ఇప్పుడు మరో సినిమాతో అలరించబోతోంది. ఆ సినిమా పేరు త్రికాల. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. ఇందులో శ్రద్ధాదాస్ భయపెట్టబోతోంది. అయితే పేరుకు ఇది హారర్ థ్రిల్లర్ అయినప్పటికీ అందాల ఆరబోత కామన్.
ఈ విషయం ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే తెలుస్తోంది. త్రికాల పోస్టర్ వచ్చింది. ఇందులో శ్రద్ధాదాస్, డార్క్ సైకాలజీ అనే పుస్తకాన్ని చదువుతోంది. దీర్ఘంగా ఏదో ఆలోచిస్తోంది. ఇంత సీరియస్ సీన్ లో కూడా ఆమె నీలిరంగు దుస్తుల్లో అందాలు ఆరబోస్తోంది.
శ్రద్ధాదాస్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఫొటోషూట్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. ఇన్నేళ్లయినా ఆమె తన ఫిజిక్ ను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. ఆ అందాలే ఆమెకు అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి.