
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రపదేశ్ కి ఉప ముఖ్యమంత్రి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తర్వాత కేబినెట్ లో చాలా పవర్ ఫుల్ శక్తి… పవన్ కళ్యాణ్. కానీ ఉన్నట్టుండి, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు చంద్రబాబు స్థానంలో పవన్ కళ్యాణ్ ని తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ని సీఎంని చెయ్యాలని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చెయ్యాలనే డిమాండ్ రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ నేతలు తమ అధినేత కుమారుడు లోకేష్ ని ఉపముఖ్యమంత్రిని చెయ్యాలి అని పిలుపు ఇవ్వడమే. పవన్ కళ్యాణ్ పూర్తిగా డామినేట్ చేస్తున్నాడు అని తెలుగుదేశంలోని ఒక వర్గం భావిస్తోందట. దాంతో, లోకేష్ వెనుకపడే అవకాశం ఉంది అని భావించి పవన్ కళ్యాణ్ లాగే లోకేష్ ని కూడా ఉపముఖ్యమంత్రి చెయ్యాలని కొందరు తెలుగుదేశం నాయకులు డిమాండ్ మొదలుపెట్టారు.
దానికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసి లోకేష్ ని ఉపముఖ్యమంత్రిని చేస్తే మాకు అభ్యంతరం లేదంటూ జనసేన నేతలు వాదన మొదలుపెట్టారు. ఐతే, ఈ వివాదానికి చంద్రబాబు నాయుడు తెరదించారు. లోకేష్ ని ఉపముఖ్యమంత్రి చేసే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ కూడా ఈసారి పొలిటికల్ గేమ్ వేరే తీరుగా ఆడుతున్నారు.