
ప్రతి హీరోయిన్ కు ఓ ఆర్ట్ ఉంటుంది. కేవలం హీరోయిన్ గా అందాలు ఆరబోయడమే కాకుండా, తమకంటూ ఓ విలక్షణత మెయింటైన్ చేస్తుంటారు. నభా నటేష్ నే తీసుకుంటే, ఆమె మంచి పెయింటర్. ఇక నిధి అగర్వాల్ అయితే 2 చేతులతో రాస్తుంది. మాళవిక శర్మ అయితే లాయర్ కూడా. ఐశ్వర్య రాజేష్ కు కూడా అలాంటి ఓ టాలెంట్ ఉంది.
తన టాలెంట్ ను తానే స్వయంగా బయటపెట్టింది ఐశ్వర్య రాజేశ్. ఎవరి సంతకాన్నయినా ఈమె ఇట్టే కాపీ కొడుతుందంట. యాజ్ ఇటీజ్ గా దాన్ని తిరిగి రీ-క్రియేట్ చేస్తుందట. దీన్నే ఫోర్జరీ అని కూడా అంటారు.
ఈ ఫోర్జరీ కళలో తను క్వీన్ అంటోంది ఐశ్వర్య రాజేశ్. ఎవరి సంతకాన్నయినా, 2-3 సార్లు ప్రాక్టీస్ చేసి పని పూర్తిచేస్తానని గర్వంగా చెబుతోంది. కాలేజ్ డేస్ లో తనకు పాఠాలు చెప్పిన టీచర్ల సంతకాలన్నింటినీ దాదాపు ఫోర్జరీ చేసిందంట ఈ పిల్ల.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. తెలుగులో లాంగ్ గ్యాప్ తర్వాత ఐశ్వర్య రాజేష్ అందుకున్న విజయం ఇది.