Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

దీపిక పదుకోన్ పరువు తీశాడు!

Cinema Desk, May 27, 2025May 27, 2025
Deepika Padukone

దీపిక పదుకోన్ అగ్ర కథానాయిక. బాలీవుడ్ అనే కాదు భారతదేశంలో 20 కోట్ల పారితోషికం అందుకుంటున్న హీరోయిన్. ప్రియాంక చోప్రా తప్ప మిగతా ఏ హీరోయిన్ కి అంత పారితోషికం అందుకునే సీన్ లేదు. దీన్ని బట్టి చెప్పొచ్చు దీపిక పదుకోన్ రేంజ్ ఏంటో. ఐతే, అలాంటి హీరోయిన్ కూడా ఈగోకి వెళ్ళింది. తనని కాదని మరో చిన్న హీరోయిన్ త్రిప్తి డిమ్రిని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసుకున్నాడు అని దీపిక పదుకోన్ ఫీల్ అయింది. ఈగోతో ఆయన తీయబోతున్న “స్పిరిట్” సినిమాపై నెగెటివ్ ప్రచారం మొదలుపెట్టింది.

కానీ వంగా మిగతా దర్శకుల్లా సైలెంట్ గా ఉండే బాపతు కదా. రెబెల్ వరంగల్ మెంటాలిటీ. అంతే, దీపిక అసలు రూపం ఇది అని బయటపెట్టాడు పబ్లిక్ గా .”స్పిరిట్ సినిమాలో శృంగార సన్నివేశాల మోతాదు ఎక్కువ” అని కొన్ని బాలీవుడ్ మీడియా వెబ్ సైట్ లు వార్తలు ప్రచురించాయి. దీపిక అందుకే తప్పుకొంది అన్నట్లుగా ఆ వార్తలు వచ్చాయి. దాంతో, సందీప్ కి అర్థమైంది ఇదంతా దీపిక టీం రాయిస్తున్న వార్తలు అని.

దాంతో, దీపిక పేరు పెట్టకుండా ఆమె చేస్తున్న పని ఏంటో తన ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి తెలియచేశాడు. “ఇంకో పని చెయ్యి మొత్తం కథ అందరికి చెయ్యి. ఏమి చేసినా నాకు ఫరక్ పడదు,” అని ఘాటుగా దీపికకి సందేశం పంపాడు.

ALSO READ: Spirit: Sandeep Reddy Vanga hits out at Deepika Padukone for ‘leaking story’

నిజానికి ఈ మొత్తం వివాదం ఇలా మలుపు తిరగడం విచిత్రం. ఆమెకి ఎంత పారితోషికం కావాలి, ఎంత మంది స్టాఫ్ కావాలి అని ఆమె డిమాండ్ చేసింది. ఆ డిమాండ్లు నచ్చకపోతే వేరే వాళ్ళని తీసుకోవాలి. ఆమె కోరుకోవడంలో తప్పులేదు, ఆమెకి అంతా ఇవ్వాలా వద్దా అనేది నిర్మాతలు డిసైడ్ చేసుకోవాలి. కానీ ఆమె కోరికలు, డిమాండ్లు ఇవి అని వంగా టీం బయటపెట్టడం తప్పే. అందుకే, దీపిక సినిమాలోని సీన్లు ఇలా ఉండబోతున్నాయి అని ఆమె లీక్ చేసింది.

మొత్తానికి ఇద్దరూ లైన్ దాటారు.

న్యూస్ DeepikaDeepika PadukonePrabhasSandeep Reddy VangaSpirit

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • Tripti
    త్రిప్తికి ఫాలోవర్స్ పెరుగుతున్నారు!
  • Alia Bhatt
    గుండు పోలీస్ తో నటించాలి!
  • Nara Rohith
    అవి తప్ప అన్నీ చేస్తా: నారా రోహిత్
  • Manchu Vishnu
    కొరియర్ లో ‘గ్రాఫిక్స్’ పంపిస్తారా?
  • Deepika Padukone
    దీపిక పదుకోన్ పరువు తీశాడు!
  • Ketika Sharma
    కేతిక మరో ఆఫర్ పట్టేసింది?
  • Allu Arjun
    ‘ఐకాన్’ టైటిల్ వాడేస్తాడా?
  • Manoj Manchu
    అందరి తరపున సారీ
  • Aishwarya Rajesh
    కామాఖ్య అమ్మవారి సన్నిధిలో
  • OG and Akhanda 2
    ‘అఖండ 2’ స్థానంలో ‘ఓజి’
  • Samantha
    ముంబై మెయిన్ అడ్డా!
  • Aditi Shankar
    శంకర్ కూతురుకి హిట్ దక్కేనా?
  • Tripti and Deepika Padukone
    దీపికపై రివెంజ్ కోసమేనా?
  • Mani Ratnam
    నంబర్ల కోసమే సినిమాలు వద్దు!
  • Tamannah
    రూ.6 కోట్లు చేజారిపోతాయా?

ఇతర న్యూస్

  • త్రిప్తికి ఫాలోవర్స్ పెరుగుతున్నారు!
  • గుండు పోలీస్ తో నటించాలి!
  • అవి తప్ప అన్నీ చేస్తా: నారా రోహిత్
  • కొరియర్ లో ‘గ్రాఫిక్స్’ పంపిస్తారా?
  • దీపిక పదుకోన్ పరువు తీశాడు!
©2025 www.telugucinema.com. All Rights reserved.
Privacy Policy | Disclaimer | About Us | Contact Us