
“రాబిన్ హుడ్” సినిమా ఫెయిలైనా ఆ సినిమాలో కేతిక శర్మ చేసిన ఐటెంసాంగ్ పెద్ద హిట్టయింది. మరీ ముఖ్యంగా కట్టుకున్న దుస్తుల్ని ముందుకులాగి ఆమె వేసి స్టెప్ వైరల్ అయింది. దీంతో ఆమెకు క్రేజ్ వచ్చింది. వరుసగా అవకాశాలొస్తున్నాయి.
“రాబిన్ హుడ్” తర్వాత “సింగిల్” అనే సినిమా చేసింది. “సింగిల్” సినిమా ఆమెకి మొదటి హిట్. దాంతో ఇప్పుడు రవితేజ సరసన నటించబోతోంది. త్వరలోనే కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు రవితేజ. ఇందులో హీరోయిన్ గా కేతిక శర్మను తీసుకోబోతున్నారు.
Photos: Ketika Sharma radiates dreamy vibes
నిజానికి ఈ సినిమా కోసమ మమిత బైజు, కయాదు లాంటి హీరోయిన్ల పేర్లు అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కేతిక శర్మ అవకాశం అందుకుంది. ఇప్పటికే హిందీ సినిమాతో పాటు, ఓ తమిళ సినిమా చేస్తున్న కేతిక, ఈ మూవీతో మరింత బిజీ కానుంది.
తెలుగులో ‘రొమాంటిక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కేతికకి “రాబిన్ హుడ్” సినిమాలోని పాట ఆమె కెరీర్ కి హెల్ప్ అయింది. “సింగిల్” సక్సెస్ ఆమె కెరీర్ ని నిలబెట్టింది.