
‘ఐకాన్’ అనే టైటిల్ ఇప్పటికీ అందరికీ గుర్తే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే సినిమాకు ఈ టైటిల్ పెట్టారు. టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ పైకి రాలేదు.
అయితే సినిమా సెట్స్ పైకి రాకపోయినా, ఆ టైటిల్ ను మాత్రం బన్నీ వదల్లేదు. ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీకి ఆ టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకు ‘ఐకాన్’ అనే టైటిల్ అనుకుంటున్నారట.
సైన్స్ ఫిక్షన్, యాక్షన్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమాకు ‘ఐకాన్’తో పాటు ‘సూపర్ హీరో’ అనే మరో టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే బన్నీ మాత్రం ‘ఐకాన్’ అనే టైటిల్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్లపై జోరుగా చర్చ నడుస్తోంది. దీపిక పదుకోన్ హీరోయిన్ గా నటించబోతోందనే చర్చ సాగుతోంది. దీంతో పాటు, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సేను కూడా ఫైనల్ చేసినట్టు ప్రచారం నడుస్తోంది. త్వరలోనే హీరోయిన్ పై అధికారిక ప్రకటన రానుంది.