
మొత్తానికి వివాదానికి తెరదించాడు నటుడు పృథ్వీ. “లైలా” సినిమాని బాయ్ కాట్ చెయ్యాలని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పిలుపు ఇవ్వడంతో ఇప్పటికే హీరో విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పాడు. ఐతే, క్షమాపణ చెప్పాల్సింది హీరో కాదు కామెంట్లు చేసిన పృథ్వీ అంటూ మళ్ళీ ట్రెండ్ కావడంతో ఆ కమెడియన్ సినిమా బాగు కోసం ముందుకొచ్చారు.
“నా వల్ల సినిమా దెబ్బతినకూడదు అందరికీ క్షమాపణలు చెపుతున్నాను,” అని ఒక వీడియో విడుదల చేశారు.
“వ్యక్తిగతంగా నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు. రాజకీయాలకు సంబంధించి తర్వాత మాట్లాడుదాం. సినిమా వల్లే నాకు పాపులారిటీ, డబ్బు. కాబట్టి సినిమా ఎప్పుడూ బాగుండాలి. లైలా ఆడాలి. అందుకే, నా మాటల వల్ల ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా సారీ.”
“బాయ్ కాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా అని అనండి. ఫలక్ నామాదాస్ కంటే లైలా పెద్ద హిట్ కావాలి విశ్వక్ సేన్ కి,” అని పృథ్వీ చెప్పారు.
“లైలా” సినిమా రేపు (ఫిబ్రవరి 14) విడుదల కానుంది.