
ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతానికి చరణ్ చుట్టూ తిరుగుతున్న సినిమాలు ఈ రెండు మాత్రమే. అయితే చరణ్ త్వరలోనే ఓ బాలీవుడ్ దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నాడట.
ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో హాట్ హాట్ గా నడుస్తున్న చర్చ ఇది. ‘కిల్’ మూవీ దర్శకుడు నిఖిల్, తన నెక్ట్స్ వెంచర్ కు సిద్ధమౌతున్నాడు. యాక్షన్-మైథాలజీ జానర్ లో ఓ కథ రాసుకున్నాడు ఈ దర్శకుడు. రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తాడంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా కోసం రామ్ చరణ్ తో చర్చలు జరుపుతున్నాడట దర్శకుడు. ఏడాదిగా స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్న నిఖిల్, తాజాగా ప్రీ-విజువలైజేషన్ పార్ట్ కూడా పూర్తిచేశాడట.
ప్రస్తుతం రామ్ చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఈ దర్శకుడు వెయిట్ చేస్తున్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.