
ఐశ్వర్య రాజేష్ ఒక్కసారిగా తెలుగులో క్రేజ్ తెచ్చుకొంది. వెంకటేష్ సరసన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాలో ఆమె సగటు మధ్యతరగతి భార్యగా నటించి అదరగొట్టింది. తెలుగులో ఆమెకి ఇది మొదటి పెద్ద హిట్.
తెలుగులో మొదటి హిట్ కానీ ఈ భామ తమిళంలో చాలా సినిమాలు చేసింది. ఆమెది చాలా లాంగ్ కెరీర్. 35 ఏళ్ల ఐశ్వర్య ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా ప్రేమ వ్యవహారాల పుకార్లు పెద్దగా లేవు. ప్రేమ, పెళ్లి అంటే ఐశ్వర్యకు అయిష్టం అని చాలా మంది భావిస్తున్నారు. మరి ఆమె మాట ఏంటి?
“గత అనుభవాలు నన్ను ఇంకా వెంటాడుతున్నాయి. రెండు సార్లు ప్రేమలో భంగపాటు చూశాను. వేధింపులు భరించాను. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చినప్పుడు ప్రేమలో పడ్డాను. ఆ బంధంలో చాలా బాధలు, అవమానాలు, వేధింపులు చూశా. అందుకే మళ్ళీ ప్రేమ గురించి ఆలోచించాలంటే భయం వేస్తోంది. సింగిల్ గా బాగుంది ఇప్పుడు. ఇలాగే కంటిన్యూ చేస్తానేమో.” ఇది ఆమె మాట.
PHOTOS: Aishwarya Rajesh celebrates success
ఐశ్వర్య రాజేష్ తన తదుపరి తెలుగు సినిమాని ఇంకా ప్రకటించలేదు.