భాగ్యశ్రీ బోర్సే… చాలామందికి పరిచయం లేని పేరు. ఎందుకంటే, ఆమె నటించిన సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “మిస్టర్ బచ్చన్” అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతోంది భాగ్యశ్రీ.
ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉంటుండగానే ఈ అమ్మడు, వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది. దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది. దసరా నిర్మాత చెరుకూరి సుధాకర్ బ్యానర్ పై కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ తీయబోయే సినిమాలో దుల్కర్ హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్ గా తీసుకోనున్నారట.
భాగ్యశ్రీకి అప్పుడే ఇది మూడో సినిమా కావడం విశేషం. “మిస్టర్ బచ్చన్”తో పాటు, ఆమె విజయ్ దేవరకొండ సినిమాలో కూడా నటిస్తోంది.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తోన్న మూవీలో ఆమె హీరోయిన్. ఇలా ఒకేసారి మూడు సినిమాలు చెయ్యడం విశేషం.
ALSO CHECK: Bhagyashri Borse’s bewitching pose