హీరో రామ్ కొత్త సినిమా లాంఛనంగా మొదలైంది అని అంటున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” తీసిన పి.మహేష్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చేస్తున్న రామ్, ఆ సినిమా పూర్తయిన తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టే అవకాశం ఉంది.
అయితే “డబుల్ ఇస్మార్ట్” తర్వాత రామ్ నుంచి వచ్చే సినిమా ఏంటనేది ఇప్పుడు అందర్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే, తాజాగా ప్రారంభించిన సినిమాతో పాటు, అతడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా సెట్స్ పైకి వస్తుందనేది తేలాల్సి ఉంది.
రవితేజతో “మిస్టర్ బచ్చన్” సినిమా చేస్తున్నాడు హరీశ్. ఈ సినిమా పూర్తయిన తర్వాత అతడు పవన్ తో ప్రారంభించిన “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాను కంటిన్యూ చేయాల్సి ఉంది. పవన్ వెంటనే అందుబాటులోకి వస్తే “ఉస్తాద్” మొదలవుతుంది. లేట్ అయితే మాత్రం రామ్ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు.