
సీనియర్ నటి భాగ్యశ్రీ తలకి పెద్ద దెబ్బ తగిలింది. ఏకంగా 13 కుట్లు పడ్డాయి. ఇటీవల పికిల్ బాల్ ఆడుతున్నప్పుడు ఆమె గాయపడ్డారు. ఆమె నుదిటిపై బలమైన గాయం అయ్యింది. గాయం తీవ్రత కారణంగా ఆమెకు సర్జరీ చెయ్యాల్సి వచ్చిందట. ఆమె నుదిటిపై 13 కుట్లు పడ్డాయి.
ఆసుపత్రి నుండి భాగ్యశ్రీ వస్తుండగా ఆమెని పాపారాజి చిత్రకరించింది. తలకు కట్టుతో ఉన్న భాగ్యశ్రీ ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఆ ఫొటోలు చూస్తే ఆమెకి 13 కుట్లు పడ్డట్లు కనిపించడం లేదు. ఐతే గాయం డీప్ కట్ అయి ఉన్నట్లుంది. దాని తీవ్రత బయటికి కనిపించదు.
56 ఏళ్ల భాగ్యశ్రీ “మైనే ప్యార్ కియా” చిత్రంతో పాపులర్ అయింది. ఆమె ఇటీవల ప్రభాస్ నటించిన “రాధేశ్యామ్”లో కనిపించారు.