
అమీర్ ఖాన్ కి 60. అవును… శుక్రవారం (మార్చి 14) ఆయన తన 60వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకోనున్నారు. బర్త్ డేకి ఒక రోజు ముందు తన కొత్త జీవిత భాగస్వామి (గర్ల్ ఫ్రెండ్) గురించి మీడియాకి తెలిపారు. గత కొన్నేళ్లుగా గౌరీ స్ప్రాట్ (Gauri Spratt) అనే ఆమెతో తన బంధంకొనసాగుతుంది అని వివరించారు అమీర్ ఖాన్.
అమీర్ ఖాన్ మొదట రీనా దత్తాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1986లో వీరి పెళ్లి అయింది. 2002 వరకు కలిసి ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు ఇటీవలే పెళ్లి చేసుకొంది. కొడుకు జునైద్ ఖాన్ రీసెంట్ గా హీరో అయ్యాడు. రెండు సినిమాల్లో నటించాడు.
2005లో దర్శకురాలు కిరణ్ రావుని ప్రేమించి పెళ్లాడాడు. వీరికి ఒక బాబు. 2021లో వీరు ఇద్దరూ విడిపోయారు. విడిపోయినా కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. మరోవైపు, తాజాగా గౌరీ స్ప్రాట్ తో సహజీవనం. ఆమె తనకు 25 ఏళ్లుగా పరిచయం అని అమీర్ ఖాన్ తెలిపారు.
ఇప్పటివరకు అమీర్ ఖాన్ జీవితంలోకి వచ్చిన ఈ ముగ్గురు స్త్రీలు హిందువులే కావడం విశేషం. ఐతే, గౌరికి ఇప్పటికే ఆరేళ్ళ కొడుకు ఉన్నాడు. ఆమె డైవోర్సీ. బెంగళూరుకి చెందిన గౌరితో జీవిస్తున్నట్లు తెలిపిన అమీర్ ఖాన్ ఆమెని పెళ్లి చేసుకోబుతున్నారా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.