ఒకసారి ఫ్లాప్ అయిన సినిమాను హిట్ చేయడం సాధ్యమా? ఏళ్ల కిందట విడుదలైన ఫ్లాప్ సినిమాతో హిట్ కొట్టడం కుదురుతుందా? ఇవన్నీ చేసి చూపిస్తానంటున్నాడు నిర్మాత బండ్ల గణేశ్.
చాలా ఏళ్ల కిందట పవన్ కల్యాణ్ తో “తీన్ మార్” అనే సినిమా చేశాడు బండ్ల గణేశ్. ఆ సినిమా ఫ్లాప్ అయింది. అది ఎందుకు ఫ్లాప్ అయిందో ఇప్పటికీ తనకు అర్థం కాదంటున్నాడు ఈ నిర్మాత.
రీసెంట్ గా ఏదో సందర్భంలో “తీన్ మార్” సినిమా ఇంకోసారి చూశాడంట. అప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ కలిగిందంట. కాబట్టి ఈసారి సినిమాకు రిపేర్లు చేస్తానంటున్నాడు. అలా రిపీర్ చేసిన వెర్షన్ ను రీ-రిలీజ్ చేసి సూపర్ హిట్ కొడతానంటున్నాడు.
బండ్ల గణేశ్ కు తన సినిమాపై, పవన్ కల్యాణ్ పై ఆమాత్రం నమ్మకం ఉండడం సహజమే. కానీ ఇలా సినిమాకు రిపేర్లు చేసి హిట్ కొడతాననడం మాత్రం కాస్త ఓవర్ అనిపిస్తుంది. అన్నట్టు ఈ నిర్మాత, ఇక సినిమాలే లోకంగా బతికేస్తాడట. మంచి మంచి బ్లాక్ బస్టర్లు తీస్తాడట. హరీశ్ శంకర్ తో కూడా సినిమా తీస్తానంటున్నాడు.
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ని తిట్టారు కదా అని ప్రశ్నిస్తే తన శవం కూడా పవన్ గురించి గొప్పగా మాట్లాడుతుంది తప్ప పవన్ ని విమర్శించదు అని ఎప్పటిలాగే నాలుక మడతేశారు బండ్ల.