
పాన్ ఇండియా సినిమా తీయాలని, ఆ రేంజ్ కు వెళ్లాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇటు హీరోలకు, అటు దర్శకులకు కూడా ఇలాంటి డ్రీమ్స్ ఉంటాయి. అనీల్ రావిపూడి మాత్రం ఆ మాట చెప్పడం లేదు. తను ఇక్కడే ఉంటానంటున్నాడు. తనకు నచ్చిన కథలే చేస్తానంటున్నాడు.
“నేనెప్పుడు నేల విడిచి సాము చేయను. రాజమౌళి, సుకుమార్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయారు. నేను కూడా అలా వెళ్లిపోవాలనుకోను. మరీ ముఖ్యంగా నన్ను నేను అక్కడ ఊహించుకోలేను. నేను ఎక్కడ బలంగా ఉన్నానో అక్కడే ఉంటాను. అలాంటి కథలే ఎంచుకుంటాను. రీజనల్ గా నేను చేస్తున్న సినిమాలతో హ్యాపీగా ఉన్నాను.”
తను పాన్ ఇండియా సినిమాలు చేయలేనంటున్నాడు రావిపూడి. అయితే తను చేసే సినిమాలు మాత్రం పాన్ ఇండియా స్థాయికి వెళ్లలాని గట్టిగా కోరుకుంటున్నట్టు తెలిపాడు.
ప్రస్తుతం ఈ దర్శకుడు, చిరంజీవితో చేయాల్సిన సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. తను ముందుగా కథలు రాసుకోనని, హీరోను దృష్టిలో పెట్టుకొని తన దగ్గరున్న లైన్స్ కు మార్పుచేర్పులు చేస్తుంటానని అన్నాడు.