
వంద కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న హీరోలున్నారు. కానీ వంద కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే దర్శకులున్నారా? రాజమౌళి లాంటి ఒకరిద్దరు దర్శకులు మాత్రమే కనిపిస్తారు. ఇప్పుడీ జాబితాలోకి చేరాలనుకుంటున్నాడు డైరక్టర్ అట్లీ.
అవును… ఈ దర్శకుడు వంద కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ‘జవాన్’తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ఈ దర్శకుడు, అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టు చేయడానికి వంద కోట్లు అడిగినట్టు తెలుస్తోంది.
నిజానికి ‘జవాన్’ తర్వాత సల్మాన్ ఖాన్ తో సినిమా చేయడానికి ట్రై చేశాడు అట్లీ. అతడితో వర్కవుట్ కాకపోవడం, అదే టైమ్ లో అల్లు అర్జున్ తో చర్చలు సఫలం కావడంతో ఇటు షిఫ్ట్ అయ్యాడు. కానీ రెమ్యూరనేషన్ దగ్గర బేరసారాలు జరిగి… 80 కోట్లు ముందుగా ఇచ్చి… అనుకున్నంత లాభం వస్తే మిగతా 20 కోట్లు ఇచ్చేందుకు నిర్మాణ సంస్థ సన్ పిక్షర్స్ ఒప్పుకునంట్లు సమాచారం.
‘పుష్ప-2’ తర్వాత అల్లు అర్జున్ కూడా కాస్త గట్టిగానే డిమాండ్ చేస్తున్నాడు. సినిమాకు 200 కోట్లు అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే హీరో-దర్శకుడి పారితోషికాలకే 300 కోట్ల రూపాయలు అయిపోతుంది. చూస్తుంటే, ఈ సినిమా బడ్జెట్ చుక్కల్ని తాకేలా ఉంది.