
“వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి అరుదైన ఘనత దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మహిళా సాధికారికకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతోంది ఈ బ్యూటీ. ఈ విషయాన్ని మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతోంది..”
ఇలా అన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదంట. తాజాగా ఏపీ ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ హ్యాండిల్ ఈ వార్తలను తప్పు పట్టింది.
గతంలో సమంత, పూనమ్ కౌర్ లాంటి హీరోయిన్లు ప్రభుత్వాల తరఫున ఇలా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సమంతాను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోగా… అదే రంగానికి ఏపీ సర్కారు పూనమ్ కౌర్ ను ఎంపిక చేసింది.
ఇప్పుడు మహిళా సాధికారిత కోసం మీనాక్షి చౌదరిని ఎంపిక చేసింది ఏపీ ప్రభుత్వం అని వార్తలు వచ్చాయి.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మీనాక్షి పాపులారిటీ పెరిగింది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. చేతిలో చాలా సినిమాలున్నాయి. కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయడమే కష్టంగా ఉంది.