
“పటాస్” సినిమా నుంచి అనిల్ రావిపూడిది ఒకటే పంథా. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు ఆనందంగా చూసి వెళ్ళాలి. కథ కన్నా వినోదానికి విలువ ఇస్తాడు అనిల్ రావిపూడి. అందుకే, అన్ని హిట్స్ ఉన్నాయి. తాజాగా “సంక్రాంతికి వస్తున్నాం”తో నా ఖాతాలో ఎనిమిదో హిట్ పడుతుంది అని ధీమాగా చెప్తున్నాడు.
వెంకటేష్ హీరోగా నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” ఈ పండుగ పూట కడుపుబ్బా నవ్విస్తుంది, ఇది మంచి కాలక్షేపం ఇస్తుంది అనేది అనిల్ రావిపూడి మాట.
“ఇందులో కామెడీని కొత్తగా ఫీల్ అవుతారు. కొన్ని కొత్త ఎలిమెంట్స్ పెట్టాను. ఖచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. తెలుగు ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ ఇస్తాను, ఇది నా ప్రామిస్,” అని అంటున్నాడు రావిపూడి
“ఏడు సినిమాలని హిట్ చేసి నాకు ఎనర్జీ ఇచ్చిన ఆడియన్స్ కి కృతజ్ఞతలు. ఎనిమిదో సినిమా వస్తోంది. ఇది నా కెరీర్ లో బెస్ట్ ఎంటర్ టైనర్ కాబోతోంది. నాకు ఎంతో ఎనర్జీ ఇచ్చిన వెంకటేష్ గారికి థాంక్ యూ. ఫ్యామిలీతో కలసి ఈ సినిమా చూడండి. హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటికి వస్తారు. ఇది మీకు మెమరబుల్ సంక్రాంతి వస్తుంది. దట్స్ మై ప్రామిస్.”