తన డేటింగ్ పుకార్లపై, బ్రేకప్ పై ఇన్నాళ్లూ మీడియాలో వచ్చిన కథనాలపై పూర్తిగా క్లారిటీ ఇచ్చింది అనన్య పాండే. బాయ్ ఫ్రెండ్ ఆదిత్యరాయ్ కపూర్ తో బ్రేకప్ అయినట్టు వెల్లడించింది. అంతేకాదు, తన అతడి ఫొటోల్ని తగలబెట్టినట్టు స్పష్టం చేసింది.
ఓటీటీలో రిలీజ్ అవుతున్న తన కొత్త సినిమా ప్రచారంలో భాగంగా ఆమె ఈ విషయాన్ని బయటపెట్టింది.
తనకు ఎవరి మీదైనా కోపం ఉంటే వాళ్ల ఫొటోల్ని కాల్చేస్తానని, తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ఫొటోల్ని కూడా ఇలానే కాల్చేశానని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో “జబ్ వియ్ మెట్” సినిమాలో కరీనా పోషించిన పాత్ర తనకు ఆదర్శమని వెల్లడించింది.
అనన్య-ఆదిత్యరాయ్ చాన్నాళ్లు ప్రేమించుకున్నారు. కుదిరినప్పుడల్లా విదేశాలకు వెళ్లిపోయేవారు. వాళ్ల డేటింగ్ పై లెక్కలేనన్ని స్టోరీలొచ్చాయి. అంతలోనే ఏమైందో ఏమో ఉన్నఫలంగా అతడ్ని వదిలేసింది. తన ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి బ్రేకప్ పార్టీ కూడా ఇచ్చింది. ఆ తర్వాత అతడి ఫొటోల్ని తగలబెట్టింది.
ప్రస్తుతం ఈమె వాకర్ బ్లాంకో అనే విదేశీ కుర్రాడితో ఫ్రెష్ గా డేటింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇతడొక మాజీ మోడల్. ప్రస్తుతం అంబానీ కి ఓ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నాడు.