
అక్కినేని ఇంట మరో పెళ్లి జరగబోతోంది. రీసెంట్ గా నాచైతన్య-శోభిత పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే అఖిల్-జైనాబ్ రౌజీ కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఓవైపు నాగచైతన్య పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగానే, మరోవైపు అఖిల్-జైనాబ్ నిశ్చితార్థం కూడా జరిగిన సంగతి తెలిసిందే.
అలా పెళ్లికి సంబంధించి ఒక దశ పూర్తిచేసిన ఈ జంట, ఇప్పుడు పెళ్లి ఏర్పాట్లలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా అఖిల్-జైనాబ్ కలిసి విమానాశ్రయంలో కనిపించారు. వాళ్లు తమ పెళ్లి షాపింగ్ కోసమే బయల్దేరినట్టు చెప్పుకుంటున్నారు చాలామంది.
తాజా సమాచారం ప్రకారం, వచ్చే నెల చివర్లో అఖిల్-జైనాబ్ పెళ్లి జరిగే అవకాశం ఉంది. నాగచైతన్య పెళ్లి జరిగిన అన్నపూర్ణ స్టుడియోస్ లోనే అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు మొదలైనట్టు చెబుతున్నారు.
వరుసగా ఫ్లాపులు రావడంతో సినిమాలు తగ్గించేశాడు అఖిల్. మరీ ముఖ్యంగా ‘ఏజెంట్’ డిజాస్టర్ అయిన తర్వాత సినిమాల గురించి ఆలోచించడం మానేసినట్టున్నాడు. ప్రస్తుతానికైతే 2 సినిమాల్ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఏదీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. పెళ్లి తర్వాతే అఖిల్ కొత్త సినిమా ప్రకటనలు రావొచ్చు.