
తను నూటికి నూరుపాళ్లు సాధారణ పౌరుడ్ని అంటున్నాడు అల్లు అర్జున్. తనకు ఎలాంటి భేషజాలు ఉండవని, మనసులో స్టార్ డమ్ లాంటి ఫీలింగ్స్ పెట్టుకోనని అన్నాడు. సింపుల్ గా, నిస్వార్థంగా ఉండడం తన మనసులో పుట్టుక నుంచి ఉందని, దాన్ని ఎవ్వరూ వేరు చేయలేరని అంటున్నాడు.
‘ది హాలీవుడ్ రిపోర్టర్’ అనే అంతర్జాతీయ పత్రిక ఇండియన్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఈ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విషయాల్ని చెప్పుకొచ్చాడు బన్నీ. అతడు నటించిన ‘పుష్ప-2’ సినిమా ఆల్ ఇండియా హిట్టయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1871 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
తన సినిమా ఇంత ఘనత సాధించినప్పటికీ, తనకు ఎలాంటి ఇగోస్ ఉండవని ప్రకటించాడు అల్లు అర్జున్. ఓ సినిమా చూసినప్పుడు సాధారణ పౌరుడిగానే చూస్తానని, ఇక షూటింగ్స్ లేనప్పుడు అంతకంటే సింపుల్ గా ఉంటానని అన్నాడు. షూటింగ్స్ లేని టైమ్ లో ఏమీ చేయనని, కనీసం పుస్తకం కూడా చదవనని తెలిపిన బన్నీ… ఏం చేయకుండా ఉండడమే తనకిష్టమని ప్రకటించాడు.
త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్. అట్లీతో కూడా చర్చలు జరుపుతున్నాడు. వీటిలో ఏ సినిమా ముందుగా ప్రారంభం అవుతుందనేది త్వరలోనే తెలుస్తుంది.