
చిరంజీవి ఈ ఏడాది తన వివాహ వార్షికోత్సవాన్ని విభిన్నంగా జరుపుకున్నారు. విమానంలో ఆయన తన వెడ్డింగ్ యానివర్సిరీని సెలబ్రేట్ చేసుకున్నారు.
దుబాయ్ కు వెళ్తూ, ఇలా మార్గమధ్యంలో గాల్లో చిరంజీవి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు నాగార్జునతో పాటు మరికొంతమంది.ఈ సందర్భంగా సురేఖపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు చిరంజీవి.
“సురేఖ లాంటి కలల సహధర్మచారిణి నాకు దొరకడం నా అదృష్టం. ఆమే నా బలం. ఆమె నాకు అద్భుతమైన ప్రేరణ” అంటూ ట్వీట్ చేశారు.
ఈసారి వివాహ వార్షికోత్సవానికి చిరంజీవి దంపతులతో పాటు నాగార్జున-అమల, నమ్రతా శిరోద్కర్ తో పాటు మరికొంతమంది దుబాయ్ వెళ్తున్నారు. ఇది కేవలం వివాహ వార్షికోత్సవం మాత్రమే కాదు, రీసెంట్ గా తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు సురేఖ. సో, ఆమె బర్త్ డేతో పాటు వివాహ వార్షికోత్సవాన్ని కలిపి సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.