
నటి అభినయ ఇటీవల నిశ్చితార్థం జరుపుకొంది. సినిమాల్లో ఎక్కువగా సిస్టర్ పాత్రల్లో కనిపించే అభినయ తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతోంది. తాజాగా ఆమె తన కాబోయే భర్త ఇతనే అంటూ పరిచయం చేసింది.
వేగేశ్న కార్తీక్ (Vegesana Karthik) అనే తెలుగు కుర్రాడిని ఆమె పెళ్లి చేసుకోబోతోంది. సన్నీ వర్మ అతని ముద్దు పేరు. ఈ నెల 9న నిశ్చితార్థం జరిగింది అని, అతనికి ఓకె చెప్పడానికి క్షణం కూడా ఆలోచించలేదు అని పేర్కొంది. “Engaged on 9th March 25.. The easiest yessss,” అని ఇంగ్లీషులో రాసింది.
చాలా కాలం ఈ అమ్మడు హీరో విశాల్ తో డేటింగ్ లో ఉందని అందరూ భావించారు. కానీ ఆమె వేగేశ్న కార్తీక్ తో చాలా ఏళ్లుగా డేటింగ్ లో ఉందట.
అభినయకు చిన్నప్పటినుంచే మాటలు రావు. అయినా ఆమె అద్భుతంగా సినిమాల్లో నటించింది, నటిస్తోంది. వేగేశ్న సూపర్ రిచ్ బిజినెస్ మేన్ అని తెలుస్తోంది.