
రీతూ వర్మ, యువ హీరో వైష్ణవ్ తేజ్ తో సీరియస్ గా డేటింగ్ లో ఉందని చాలా కాలంగా ప్రచారం ఉంది. ఐతే, వీరిద్దరూ కలిసి దుబాయ్ బుర్జ్ ఖలీఫా ముందు దిగిన తాజా ఫోటో సోషల్ మీడియా చక్కర్లు కొట్టడంతో ఇక వీరిద్దరూ పెళ్ళికి సిద్ధం అవుతున్నారేమో అన్న వార్తలు మొదలయ్యాయి. గత వారం రోజులుగా ఈ ప్రచారం బాగా జరిగింది.
ఐతే, ఈ వార్తలపై ఈ భామ అస్సలు స్పందించడం లేదు. పూర్తిగా మౌనం వహించింది.
వైష్ణవ్ తేజ్ తో పోల్చితే రీతూ వర్మ కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్. వైష్ణవ్ స్పందించకపోయినా రీతూ వర్మ ఎదో ఒకటి పోస్ట్ చేస్తుంది అని అనుకున్నారు జనం. కానీ ఆమె అటు వార్తలను తప్పు అని తోసిపుచ్చలేదు. అవును అని ఒప్పుకోలేదు. ఈ మౌనం అంగీకారమేనా అన్న డౌట్ వస్తోంది.
రీతూ, వైష్ణవ్ కలిసి నటించలేదు కానీ నిహారిక కారణంగా వీరిద్దరి మధ్య స్నేహం, ఆ తర్వాత డేటింగ్ మొదలైనట్లు టాక్. వైష్ణవ్ కి మరదలు వరసయ్యే నిహారిక కొణిదలకు రీతూ వర్మ క్లోజ్ ఫ్రెండ్.

ఇద్దరి కెరీర్లో పెద్ద ఎదుగుదల లేదు. మరి ఈ జంట తమ రిలేషన్ షిప్ ని కొనసాగించి పెళ్లి వరకు వెళ్తారా? డేటింగ్ తో ప్యాకప్ చెప్తారా అనేది చూడాలి.