
కొన్నాళ్లు సైలెంట్ అయిపోయిన పైరసీ మాఫియా మళ్ళీ రెచ్చిపోతోందా? వందల కోట్లు పెట్టి, ఏళ్ల కొద్దీ కస్టపడి తీసిన సినిమాలను టార్గెట్ చేసి పైరసీ చేస్తున్నారా? ముఖ్యంగా రామ్ చరణ్ కొత్త సినిమాపై ఒక కుట్ర జరుగుతోందా?
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘గేమ్ చేంజర్’ విడుదల రోజే ఆన్‌లైన్‌లో పైరసీ ప్రింట్ లీక్ అయ్యింది. దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఒక ముఠా ఉంది అని తేలింది.
‘గేమ్ చేంజర్’ నిర్మాతలకి, టీంలోని ఇతర సభ్యులకు రిలీజ్ కు ముందే సోషల్ మీడియా, అలాగే వాట్సాప్‌లలో కొంత మంది నుంచి బెదింపులు వచ్చాయట. అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని చెప్పి ఘర్షణ పడ్డారట. విడుదలైన తర్వాత హోచ్‌డి ప్రింట్ లీక్ చేయడమే కాదు… టెలిగ్రామ్, సోషల్ మీడియాలో అందరికీ షేర్ చేశారు.
‘గేమ్ చేంజర్’ చిత్ర బృందాన్ని బెదిరించిన, పైరసీ ప్రింట్ లీక్ చేసిన 45 మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసింది టీం. ఆ 45 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి ‘గేమ్ చేంజర్’ మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారా? పైరసీ ప్రింట్ లీక్ చేశారా? లేదంటే వాళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది.
ఈ కేసును టేకప్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.