
విశ్వక్ సేన్ తాజా చిత్రం లైలా. ఈ సినిమాకు సీక్వెల్ కు లీడ్ ఇచ్చే ఓ మంచి సీన్ ఉందంటున్నాడు. అయితే ఆ సీన్ పై చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చాడు. ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన విశ్వక్, ఏమంటున్నాడో చూద్దాం..
లోటు భర్తీ చేయాలని లేడీ గెటప్…
ఆర్టిస్ట్ గా కొన్ని పాత్రలు చేయాలని ప్రతి నటుడికి ఉంటుంది. ‘భామనే సత్యభామనే’, ‘మేడమ్’, ‘చిత్రం భళారే విచిత్రం’, ‘రెమో’ సినిమాలు చూసినప్పుడు ఆర్టిస్టుగా ఇలాంటి గెటప్ వేయాలని ఉండేది. అలాగే ఆడియన్స్ ఇప్పుడు కొత్త కథలని, థీమ్స్ ని కోరుకుంటున్నారు. ఇలాంటి సినిమాలురాక దాదాపుగా దశాబ్దాలు అవుతుంది. ఈ జనరేషన్ లో ఒక హీరో అమ్మాయి పాత్ర వేయడం గత 20 ఏళ్లుగా మనం చూడలేదు. ఆ లోటుని భర్తీ చేయాలని ఒక మంచి కథ రావడంతో ఈ సినిమా ఒప్పుకున్నాను.
సోనూ మోడల్ కంటే లైలానే…
సినిమాలో 2 పాత్రలు పోషించాను. ఒకటి సోనూ మోడల్, ఇంకోటి లైలా. ఈ రెండు పాత్రల్లో లైలా పాత్ర అంటేనే నాకిష్టం. అయితే సోను క్యారెక్టర్ కు కూడా మీరు ఫాన్స్ అయిపోతారు. ట్రైలర్లు పబ్లిసిటీలో లైలా డామినేట్ చేస్తుంది. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మాత్రం సోను క్యారెక్టర్ ని కూడా చాలా ఇష్టపడతారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సోనూదే డామినేషన్.
బూతు కాదు, యూత్…
ట్రయిలర్ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందంటున్నారు. అది బూతు కాదు, యూత్ ఫుల్ కంటెంట్. సినిమా అవుట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్.
చిరు ‘కాంపౌండ్’ డైలాగ్ పై…
– ఇండస్ట్రీలో ఎలాంటి కాంపౌండ్స్ లేవని నేను మాట్లాడిన మాటలకు చిరంజీవి మద్దతు తెలపడం, దాని గురించి ఆయన వివరంగా మాట్లాడ్డం చూసి ముచ్చటేసింది. ఆ మేటర్ అక్కడితో ఎండ్ అయిపోయిందనున్నాను కానీ చిరంజీవి మాట్లాడిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. అందరం అందర్నీ సపోర్ట్ చేసుకోవాలి. అంతిమంగా మనం మంచి సినిమాల్ని ఆడియన్స్ ఇవ్వాలి.
చిరంజీవి కొరికేస్తాననడం నచ్చింది…
– లైలా సినిమాకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ చిరంజీవి గారిదే. నా లేడీ గెటప్ చూసి కొరికేయాలని ఉందంటూ చిరంజీవి చెప్పడం నాకు బెస్ట్ కాంప్లిమెంట్.
సీక్వెల్ ఉంది…
– “లైలా” గెటప్ మళ్ళీ వేయాలని ఉంది. ఇందులో సీక్వెల్ కి పనికొచ్చే మంచి క్లిప్ హ్యంగర్ సీన్ ఉంది. మంచి రెస్పాన్స్ వస్తే సెకండ్ వీక్ లో ఆ సన్నివేశాన్ని యాడ్ చేస్తాం.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్…
– అనుదీప్ కెవి దర్శకత్వంలో “ఫంకీ” సినిమా ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేస్తున్నాం… ఈ నెలాఖరుకు నటీనటుల్ని పరిచయం చేసి సెట్స్ పైకి వెళ్తాం.