హీరోలు కేవలం హిట్స్ వస్తే మాత్రమే సంతోషంగా ఉండరు. హిట్స్ తో పాటు అవార్డులు కావాలి. రివార్డులు రావాలి అనుకుంటారు. ఇంకా యాడ్లు కూడా ఉండాలి. ఈ మధ్య సోషల్ మీడియా ఫాలోవర్ల పిచ్చి కూడా మొదలైంది.
దానికి తోడు… మైనపు బొమ్మల క్రేజ్ కూడా షురూ. ప్రభాస్, మహేష్ బాబులకు మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు విగ్రహం ఏర్పాటు కావడంతో తనకి కూడా అలాంటిది కావాలని అల్లు అర్జున్ ఆశ పడ్డారు. ఆయన ఆశకు తగ్గట్లే మేడమ్ టుస్సాడ్స్ బన్నిని సంప్రదించారు. దుబాయ్ లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం నెలకొల్పారు.
తెలుగులో ఇతర పెద్ద హీరోలకు మైనపు విగ్రహాలు లేవు. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, వంటి స్టార్స్ కి కూడా త్వరలో ఇతర మ్యూజియంలో వాక్స్ స్టాట్యూలు వస్తాయని భావించొచ్చు.
ఇక ఇప్పుడు రామ్ చరణ్ కి గౌరవ డాక్టరేట్ దక్కింది. చాలా చిన్న వయసులో రామ్ చరణ్ కి ఇలాంటి గౌరవం దక్కింది. తమిళనాడుకి చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం ఈ డాక్టరేట్ ఇచ్చింది రామ్ చరణ్ కి.
ఇక మిగతా హీరోలు కూడా ఆ గౌరవాన్ని పొందేందుకు “ఆశ”పడుతారని చెప్పొచ్చు. సో, మిగతా హీరోలు కూడా త్వరలోనే డాక్టర్లు అవుతారని అనుకోవచ్చు.