దర్శకుడు శంకర్ అటు ‘భారతీయుడు 2’, ఇటు ‘గేమ్ ఛేంజర్’ సినిమాలతో బిజీగా ఉంటూనే తండ్రిగా కూతురి పెళ్లి బాధ్యతలను కూడా చూసుకున్నారు. ఈ రోజు ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య పెళ్లి చెన్నైలో ఘనంగా జరిగింది.
శంకర్, ఆయన భార్య ఈశ్వరికి ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు ఐశ్వర్యకు గతంలో రోహిత్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. కానీ ఏడాది గడవకముందే వాళ్ళు విడిపోయారు. ఆ తర్వాత ఆమె సహాయ దర్శకుడు తరుణ్ కార్తికేయన్ తో ప్రేమలో పడింది. అతనితో ఈ రోజు పెళ్లి జరిగింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్, సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, కార్తీ సహా పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీస్ పెళ్ళికి హాజరయ్యి కొత్త దంపతులను ఆశీర్వాదించారు.
శంకర్ రెండో కూతురు ఆదితి ప్రస్తుతం తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. కొడుకు చదువుకుంటున్నాడు.
Advertisement