
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా అని ఆమె ఆవేదనలో ఉంది. ఇదంతా మైసూర్ శాండిల్ సబ్బు మేటర్.
కర్నాటక ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంది ఈ సబ్బుల కంపెనీ. దీన్ని ఉత్తరాదిన కూడా విస్తరించేందుకు తమన్నాతో డిల్ కుదుర్చుకున్నారు. బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఏకంగా 6 కోట్ల 20 లక్షల రూపాయలు ఆఫర్ చేశారు.
డీల్ పెద్దదే, తమన్నా కూడా వెంటనే ఒప్పుకుంది. అయితే కర్నాటకలో ప్రతిపక్షాలు, కొన్ని కన్నడ సంఘాలు మాత్రం ఒప్పుకోలేదు. ప్రస్తుతం అక్కడంతా లోకల్ ఫీలింగ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా సబ్బు యాడ్ కు కన్నడేతర హీరోయిన్ ను నియమించడంపై కన్నడ సమాజం భగ్గుమంటోంది. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వం తిప్పికొడుతున్నప్పటికీ డీల్ ఎక్కడ కాన్సిల్ అవుతుందోననే టెన్షన్ మాత్రం తమన్నాలో ఉంది. 3-4 సినిమాలు చేస్తే వచ్చే డబ్బు, ఒక్క డీల్ తో వస్తోంది.