
ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్… సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తీసిన మూవీ ఇది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. ఐశ్వర్య రాజేష్ తెలుగులో ఇంతకుముందు కొన్ని సినిమాలు చేసినా ఆమెకి సరైన పాపులారిటీ రాలేదు. ఇప్పుడు ఈ సినిమాతో ఆమెకి తెలుగునాట పాపులారిటీ పెరిగింది. రావాల్సిన విజయమూ వచ్చింది.
మరి ఇప్పుడు ఆమెకి అవకాశాలు పెరుగుతాయా?
ఐశ్వర్య రాజేష్ గ్లామర్ హీరోయిన్ కాదు. మంచి నటి. ఎలాంటి పాత్రనైనా సులువుగా పోషించగలదు. వెంకటేష్ వంటి 60 ప్లస్ హీరోకి భార్యగా కూడా మెప్పించింది. 35 ఏళ్ల ఈ భామ ఇప్పుడు తెలుగులో మంచి అవకాశాలు కోరుకుంటుంది. మరి మన నిర్మాతలు, దర్శకులు ఆమెకి మంచి పాత్రలు ఇస్తారా?
ఆమె పుట్టింది, పెరిగింది చెన్నైలోనే కానీ ఆమె అచ్చ తెలుగు అమ్మాయి. ఆమె తండ్రి రాజేష్ ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. “రెండు జెళ్ళ సీత”, “ఆనంద భైరవి” వంటి సినిమాల్లో నటించారు. ప్రముఖ హాస్య నటి శ్రీలక్ష్మి ఐశ్వర్యకు మేనత్త.