
కొన్ని రోజుల కిందటి సంగతి.. దిల్ రాజు కాస్టింగ్ కాల్ కు పిలుపునిచ్చాడు. విజయ్ దేవరకొండ సినిమాలో నటించడానికి ఆసక్తి ఉన్నవాళ్లు ముందుకురావాలనేది దాని సారాంశం. రవికిరణ్ కోలా దర్శకత్వంలో రాబోతున్న సినిమా కోసం కొత్త నటీనటులు కావాలని, గోదారి యాసలో మాట్లాడగలిగితే మీకే ఫస్ట్ ప్రయారిటీ అంటూ కాస్టింగ్ కాల్ ఇచ్చారు.
కట్ చేస్తే, ఇప్పుడు మరోసారి అదే సినిమాకు సంబంధించి కాస్టింగ్ కాల్ ప్రకటన ఇచ్చారు నిర్మాత దిల్ రాజు. 5 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు అన్ని వయసుల అమ్మాయిలు, అబ్బాయిలు, చిన్నారులకు నటించే అవకాశం అంటూ ప్రకటించారు.
దీంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఒకే సినిమాకు రెండోసారి కాస్టింగ్ కాల్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? చాలామంది ఊహిస్తున్నదేంటంటే.. మొదటి కాస్టింగ్ కాల్ సక్సెస్ అవ్వలేదంట. ఆశించిన టాలెంట్ దొరకలేదంట. అందుకే ఇప్పుడు మరోసారి ప్రకటన ఇచ్చారు.
‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు థియేటర్లలోకి వచ్చేయడంతో దిల్ రాజు ఫ్రీ అయిపోయారు. ఇప్పుడు తన పూర్తి ఫోకస్ మొత్తం విజయ్ దేవరకొండ సినిమాపైనే పెట్టారు. ఎందుకంటే, ప్రస్తుతం ఈయన చేతిలో ఉన్న పెద్ద సినిమా ఇదొక్కటే. ‘ఫ్యామిలీ స్టార్’ ఫ్లాప్ తర్వాత దిల్ రాజు, దేవరకొండ కాంబోలో రాబోతున్న సినిమా ఇది.