
‘తండేల్’ సినిమాకు తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అడగలేదు. ప్రస్తుతం ఉన్న రేట్లు తమ సినిమాకు సరిపోతాయన్నారు నిర్మాత అల్లు అరవింద్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాత్రం ప్రత్యేక అనుమతి తెచ్చుకున్నారు.
పేరుకు ప్రత్యేక అనుమతే అయినప్పటికీ కేవలం 50 రూపాయల పెంపు మాత్రమే కోరారు. అది కూడా వారం రోజుల పాటు మాత్రమే. ఇప్పుడు ఆ పెంపు కూడా లేదు.
ఈరోజు నుంచి ఏపీలోని చాలా స్క్రీన్స్ లో సాధారణ రేట్లకే ‘తండేల్’ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని అల్లు అరవింద్, బన్నీ వాస్ సంయుక్తంగా ప్రకటించారు. మరింతమంది కుటుంబ ప్రేక్షకుల దగ్గరకు సినిమాను తీసుకెళ్లేందుకు, ప్రత్యేక జీవోను సైతం పక్కనపెడుతున్నట్టు తెలిపారు.
ALSO READ: Thandel posts impressive numbers in its first weekend
నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది.