
తమన్న, విజయ్ వర్మ రెండేళ్లు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇక పెళ్లి కూడా చేసుకుంటారు అని అందరూ భావిస్తున్న తరుణంలో బ్రేకప్ గుసగుసలు మొదలయ్యాయి. రెండు రోజులుగా సాగుతున్న ప్రచారం ఈ రోజు (మార్చి 4)తో కన్ఫర్మ్ అయింది.
దానికి కారణం… తమన్నా పీఆర్ టీం బాలీవుడ్ మీడియాకి ఈ బ్రేకప్ లీకులు ఇచ్చిందట. దాంతో ఒక్కసారిగా అన్ని మీడియాల్లో వార్త వైరల్ అయింది.
త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. ఇద్దరి మధ్య అంత డీప్ బాండింగ్ ఏర్పడింది అని చెప్పారు. మరి ఎందుకు బ్రేకప్ చెప్పుకున్నారు? ఇదే పెద్ద ప్రశ్న. గత రెండు, మూడు వారాలుగా తమన్న అన్ని చోట్లకి సింగిల్ గానే వెళ్తోంది. వాళ్లిద్దరూ జంటగా రెండు నెలల క్రితం కనిపించారు. పెళ్లి విషయంలోనే ఎదో విభేదాలు వచ్చాయి అని కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రచురించాయి.
ALSO READ: Tamannaah Bhatia and Vijay Varma: Breakup rumors surface!
ఐతే, తమన్న కానీ, విజయ్ వర్మ కానీ ఇప్పటివరకు అధికారికంగా చెప్పలేదు.

ప్రస్తుతానికి ఇద్దరూ తమ ఇన్ స్టాగ్రామ్ లో కలిసి నటించిన “లస్ట్ స్టోరీస్ 2”, యాడ్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అలాగే ఉంచారు. తొలగించలేదు. ఐతే, విజయ్ వర్మ మాత్రం తమన్నాకి సంబంధించిన పర్సనల్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ నుంచి తీసేశాడు అని ఫ్యాన్స్ అంటున్నారు.