
కళ్లముందే 50వ చిత్రం మైలురాయికి చేరుకున్నాడు నటుడు విజయ్ సేతుపతి. కేవలం హీరోగా కాకుండా ఓ నటుడిగా ఎదగాలనేది ఇతడి కోరిక. అందుకే హీరోగా చేస్తూనే, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కూడా కనిపిస్తుంటాడు. అలా వడివడిగా 50వ చిత్రం మైలురాయికి చేరుకున్నాడు విజయ్ సేతుపతి.
ఈ హీరో 50వ చిత్రాన్ని స్వామినాధన్ డైరక్ట్ చేశాడు. తెలుగులో కూడా ఇది విడుదలకు సిద్ధమౌతోంది. తెలుగులో దీనికి మహారాజ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ట్రయిలర్ కూడా విడుదల చేశారు.
సినిమాలో విజయ్ సేతుపతి బార్బర్ గా కనిపించబోతున్నాడు. తన “లక్ష్మి”ని వెదికే పాత్రలో అతడు నటించాడు. ట్రైలర్ చివర్లో, విజయ్‌ని ఎదుర్కొనే వ్యక్తిగా అనురాగ్ కశ్యప్ ను చూపించారు.
జూన్ 14న థియేటర్లలోకి రాబోతోంది మహారాజ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత మమతా మోహన్ దాస్ నటించిన సినిమా ఇది. అజనీష్ లోక్ నాధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో హైలెట్ అంటున్నారు