దాదాపు 16 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది కాజల్. ఇన్నేళ్ల కెరీర్ లో ఎక్కువగా ఆమె కమర్షియల్ గ్లామర్ పాత్రలే పోషించింది. అందుకే ఆమెకు చందమామ అనే బిరుదు కూడా ఉంది. మరి ఆ ట్యాగ్ లైన్ ను ఆమె వదిలించుకోవాలనుకుంటోందా?
కెరీర్ లో తొలిసారి ఎమోషనల్ యాక్షన్ డ్రామా చేసింది కాజల్. అదే “సత్యభామ” సినిమా. ఇందులో ఆమె పవర్ ఫుల్ పోలీస్ గా నటించింది. ఈ సినిమాతో తనను అంతా సత్యభామ అని పిలుస్తారని నమ్మకంగా చెబుతోంది. మరి చందమామ ట్యాగ్ లైన్ సంగతేంటి?
“నన్ను చాలా కాలం టాలీవుడ్ చందమామ అని పిలిచేవారు. ఇప్పుడు సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. కానీ నాకు రెండూ కావాలి. చందమామ బ్యూటిఫుల్ నేమ్, సత్యభామ పవర్ ఫుల్ నేమ్. నాకు రెండూ ఇష్టమే. ఈ కథ చెప్పినప్పుడు ఇనిస్టెంట్ గా ఓకే చెప్పాను. అంతలా నచ్చిందీ స్టోరీ.”
ఇలా తనకు రెండు ఇమేజెస్ కావాలంటోంది కాజల్. ఓవైపు ఇలా తను లీడ్ రోల్స్ చేస్తూనే, మరోవైపు మంచి కమర్షియల్ సినిమాలు కూడా చేయడానికి సిద్ధమని దీని అర్థం.